Sunday, 8 November 2026

తెలంగాణ

తెదేపాకు నాగర్‌కర్నూలు ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌ జిల్లా : తెలుగుదేశం పార్టీ నాగర్‌ కర్నూల్‌ నియోజవర్గ ఇన్‌ఛార్జి మర్రి జనార్థన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో  చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జీహెచ్‌ఎంసీ ఎదుట కూలిన మహావృక్షం

హైదరాబాద్‌ : నగరంలో వీచిన ఈదురుగాలులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద ఉన్న మహా వృక్షం కుప్పకూలింది. రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.

ఖమ్మం జల్లాలో ఎదురుకాల్పులు

ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ఇల్లెందు`కాచనపల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.

21 అక్టోబర్‌ నుంచి కాయన్‌వెల్త్‌ యూత్‌ సమావేశాలు: నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి:  అక్టోబర్‌ 21 నుంచి హైదరాబాద్‌లో కామన్‌వెల్త్‌ యూత్‌ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతాయని  స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ సమావేశాలకు 54 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి…

వైకాపా నిరసన దీక్ష విడ్డూరం : తులసిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అరెస్టయ్యి ఏడాదైన సందర్భంగా వైకాపా నిరసన దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల వికృత చేష్టలు చూస్తుంటే వారికి కోర్టులన్నా, చట్టాలన్నా, రాజ్యాంగం అన్నా కనీస గౌరవం…

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, హన్మకొండ, రామగుండంలలో 42, ఆదిలాబాద్‌, కావలి, నెల్లూరు, ఒంగోలు, రెంటచింతల, నల్గొండ ,తిరుపతి,…

ప్రాంతీయవాదంతో తప్పుడు నివేదికలు: గోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి:  ప్రాంతీయవాదంతోనే తప్పుడు నివేదికలు ఇచ్చారని ఏపీఎన్టీఓ అధశ్యక్షుడు గోపాల రెడ్డి తెలిపారు. నాపై నమోదైన కేసులపై హైకోర్టులను ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. ఏపీఎన్టీఓ హౌజింగ్‌ సొసైటీ అక్రమాలపై  కోఆపరేటివ్‌ సొసైటీ రిజిస్ట్రార్‌ హరి అబిడ్స్‌ పోలీసులకు…

సీఎంతో విజయశాంతి భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెరాస ఎంపీ విజయశాంతి సమావేశమయ్యారు. మెదక్‌ `అక్కన్నపేట రైల్వేలైన్‌ పనుల కోసం ఎంపీ కోటా నుంచి రూ. కోటి చెక్కును విజయశాంతి సీఎంకు అందజేశారు.

టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరోలో కడియంకు చోటు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరోలోకి కడియం శ్రీహరిని తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల కమిటీ ఛైర్మన్‌గా కడియంను కేసీఆర్‌ నియమించారు.