Saturday, 7 November 2026

తెలంగాణ

క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దు

హైదరాబాద్‌, జనంసాక్షి: పవిత్రమైన క్రీడారంగాన్ని తాకట్టు పెట్టొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఐపీఎల్‌ లీగ్‌ను రద్దు చేసి క్రికెట్‌లో పాత వ్యవస్థనే ఉంచాలని ఆయన శుక్రవారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపించినప్పుడే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నారాయణ…

టీ ఎంపీల సమావేశం 18కి వాయిదా

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం ఈ నెల 18 కి వాయిదా పడింది. ఎంపీలు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తుంది.

గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ: మంత్రి రామచంద్రయ్య

హైదరాబాద్‌ : గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. గోశలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే సింహాచలం గోశాలను వారికి అప్పగిస్తామని…

శూన్యంపాడులో విషజ్వరాలతో ఆరుగురి మృతి

నల్గొండ, జనంసాక్షి: నేరేడుచర్ల మండలం శూన్యంపాడులో విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఈ గ్రామంలో విషజ్వరాలతో ఆరుగురు మృతి చెందారు. అయినా వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

పదో తరగతి పరీక్షల్లో 88.08 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్థసారథి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలీస్తే ఉత్తీర్ణత 0.24 శాతం పెరిగింది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు…

సీబీఐ డైరెక్టర్‌ క్షమాపణలు చెప్పాలి: సురవరం

హైదరాబాద్‌: రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బన్సల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సీబీఐ డైరెక్టర్‌ మాట్లాడడాన్ని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తప్పుబట్టారు. కేసు ప్రాథమిక దశలోనే రంజిత్‌ సిన్హా చేసిన…

వైకాపా విస్తృతస్థాయి భేటీకి హాజరుకాని కొణతాల

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో పార్టీ విస్తృతసాయి సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ భేటీకి పార్టీ సీనియర్‌ నేత కొణతాల రామకృష్ణా హాజరుకాలేదు.

దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద మహిళ హల్‌చల్‌

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాప్‌ వద్ద మతిస్థిమితం లేని ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. చెట్టు ఎక్కి దూకుతానని బెదిరించింది. దీంతో స్థానికులు ఆమెను కిందికి దించేందుకు యత్నిస్తున్నారు.

గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల పాఠశాలల్లో 94.99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 45.50గా ఉంది.