Saturday, 7 November 2026

తెలంగాణ

జూన్‌ 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 15 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌1 చివరి తేదీ.

బాలికలదే పైచేయి

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతలో బాలికలు పైచేయిగా నిలిచారు. బాలికలు 88.90 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలుర ఉత్తీర్ణత 87.30 శాతంగా ఉంది.

ప్రథమ స్థానంలో చిత్తూరు

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 94.92 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది. 67.09 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో మెదక్‌ జిల్లా ఉంది.

88.08 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి పార్ధసారథి ఫలితాలను విడుదల చేశారు. 88.08 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.24 శాతం పెరిగింది. ఈఏడాది పదోతరగతి పరీక్షలకు మొత్తం 11,92,076 మంది…

దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ముట్టడి

హైదరాబాద్‌: దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయాన్ని భాజపా యువజన మోర్చా కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. సింహాచలం, వేములవాడ దేవాలయాల్లో గోవుల మృతికి నిరసనగా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కమిషనర్‌ఉ కార్యాలయం ఎదుట ఆవులు, దూడలతో నిరసన చేపట్టారు.

సీఐఎన్‌ఎఫ్‌ సేవలు కీలకం

హైదరాబాద్‌ఉ : ఎయిర్‌ఫోర్స్‌లు, మెట్రో రైల్వే స్టేషన్లలో సీఐఎస్‌ఎఫ్‌ సేవలు కీలకంగా మారాయని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి ఆర్పీఎస్‌ సింగ్‌ అన్నారు. హకీంపేటలోని సీఐఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. దేశంలో సీఐఎస్‌ఎఫ్‌…

ఐసెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్‌ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 256 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఈ పరీక్ష ప్రాథమిక కీ విడుదలకానుంది. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఐపీఎల్‌ నేడు

హైదరాబాద్‌: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు హైదరాబాద్‌ , రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్‌ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది.

టైర్ల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: జిన్నారం మండలం గడ్డిపోచారంలో ఉన్న ఒక టైర్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. టైర్ల ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు. ప్రమాదానికి గల…