Wednesday, 4 November 2026

తెలంగాణ

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో ఐదో ఛర్జిషీట్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరికాసేపట్లో సీబీఐ ఛార్జి షీట్‌ దాఖలుచేయనుంది. దిల్‌కుషా అతిథి గృహం నుంచి ఐదో ఛార్జిషీటు పత్రాలను అధికారులు సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ సంస్థల్లో దాల్మియా సిమెంట్స్‌ పెట్టుబడుల గుట్టును సీబీఐ…

29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహరించాలని విపక్ష పార్టీ సభ్యులను కోరుతామని ఆయన చెప్పారు.…

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. గతంలో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా…

శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

చిలుకూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చిలుకూరు మండల కేంద్రంలో శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డ నారాయణరావు, మండల తహశీల్దార్‌ ఎన్‌. సూర్యనారాయణ ఈ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. యువకులు…

విద్యుత్‌ అంశాన్ని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. దానం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదలకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. అందులో భాగంగానే 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఛార్జీలే వసూలు చేయకూడదని ముఖ్యమంత్రి నిర్ణయం…

బొత్సతో రాజనర్సింహ, జానా భేటీ

హైదారాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

రేపటి బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌ : విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన…

భీవితిలో ఆమ్ల వర్షం

బీమిలి : విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఉదయం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీటి నుంచి పొగలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై దొంగల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌-షిర్డీ టూరిస్ట్‌ బస్సుపై మరోసారి దోపిడి దొంగలు దాడి చేశారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన గరుడ బస్సు మహారాష్ట్ర భూమ్‌ వద్ద బస్సుపై దీపిడీ దొంగలు దాడి  చేసినట్లు సమాచారం. ఇంకా ఘటనకు సంబంధించి…