Wednesday, 4 November 2026

తెలంగాణ

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : సరూర్‌నగర్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామవావు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల అతని ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సిలిండర్ల లారీ బోల్తా ఘటనలో మరొకరు మృతి

గుంటూరు : చిలకలూరి పేట కాటూరు వైద్యకళాశాల వద్ద ఈ ఉదయం జరిగిన లారీ బోల్తా ప్రమాదంలో మరొరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 4కి చేరింది. ఒంగోలు నుంచి…

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో రేపటి పరీక్షలు వాయిదా

మచిలీపట్నం : కృష్ణా  విశ్వద్యాలయ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం జరగాల్సిన పీజీ నాలుగు సెమిస్టర్‌ పరీక్షలు 23 అండర్‌ గ్రాడ్యుయేషన్‌  పరీక్షలు పదో తేదీకి వాయిదా పడినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ తెలిపారు.

మంత్రి సారయ్యకు చేదు అనుభవం

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలో మంత్రి సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సమస్యలపై స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో కార్యక్రమం మధ్యలోంచే మంత్రి లేచి వెళ్లిపోయారు.

బొత్సతో డిప్యూటీ సీఎం, జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

సునీతా లక్ష్మారెడ్డి ఇంటిముందు ఆందోళనకు దిగిన అంధులు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు అంధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళనకు దిగిన అంధులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కేటీపీఎస్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి:  కేటీపీఎస్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందిం దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగి సాంకేతిక నిపుణులు మరమ్మత్తులు చేపట్టారు.

ఎల్లారెడ్డిపేటలో దొంగల ఘాతుకం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో దొంగలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 3 తులాల బంగారు గొలుసు రూ. లక్ష చోరీకి పాల్పడ్డారు. దొంగలను చూసి కేకలు వేసిన వృద్దుడి నాలుకను దొంగలు కోసేసారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు…

పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు

ఖమ్మం, జిల్లాలోని బోనకల్‌ మండలం రాయన్‌పేటలో పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. దుండగలు రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.