నల్లబ్యాడ్జీలతో చంద్రబాబు పాదయాత్ర

కాకినాడ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తూన్న .. మీకోసం ‘పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం విరామం అనంతరం ఆనందభారతి మైదానం నుంచి నేటి పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా నల్లబ్యాడ్జీలు ధరించి పాదయాత్ర చేపట్టారు. జేఎన్‌టీయూ వరకు పాదయాత్ర చేసి విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు.

తాజావార్తలు