యువతి హత్యకేసులో నిందితుడి అరెస్టు

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక సమద్రతీరంలో పది రోజుల క్రితం జరిగిన యువతి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమసంబంధం నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలి ఒత్తిడి చేస్తుండటంతో ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లెకు చెందిన రాజశేఖర్‌ గుంటూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రగూడెంకు చైందిన రాణి మరో కళాశాలలో పనిచేస్తుంది. గతంలో వీరిద్దరూ ఒకే కళాశాలలో పనిచేసేవారు ఈ నేపథ్యంలో గత 22వతేదిన సూర్యలంక సముద్ర తీరానికి వచ్చారు.పెళ్లి విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవటంతో ఆమెను బీచ్‌ సమీపంలోని మత్యృశాఖకు సంబంధించిన పురాతన భవనంలోకి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసు ఎట్టకేలకు అరెస్టు కోర్టుకు హాజరుపరిచారు.