సోనియా ఆదేశాలు… రాష్ట్రంలో ఉప ప్రణాళిక అమలు

– కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
అద్దంకి గ్రామీణ, ప్రకాశం : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను సోనియాగాంధీ అదేశాల మేరకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిందని కేంద్ర పెట్రోలియం, చేనేత, జౌళీ శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. అద్దంకి ఏఎంపీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా బడ్జెట్‌లు రూపొందిచాయని చెప్పారు. దళారులనుంచి ప్రజలను రక్షించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. అనంతరం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.