కొత్తూరు : శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సెక్టారు సూపర్వైజరు పాలక శాంతికుమారి రూ. 2వేలు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రఘువీర్, సర్కిల్ ఇన్‌స్పెక్టరు ఎస్‌కె అజాద్ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.సూపర్వైజర్‌ను అరెస్టు చేసి విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించారు.




