సంబేపల్లి : బొలెరో వాహనంలో దాదాపు రెండున్నర టన్నుల ఎర్రచందనాన్ని తరలిస్తుండగా కడప పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 50లక్షలు ఉంటుందని వారు చెబుతున్నారు. వాహనంలో ఉన్న వారు పోలీసులను చూపిన వెంటనే పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




