కిల్లి కృపారాణి
పొందూరు : అంబేద్కర్ అశయసాధనకు యువత కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం జిల్లా రాపాక గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆమె శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొనియాడాయని అన్నారు. యువత సేవాభావాన్ని అలవర్చు కోవాలని, సమాజసేవ చేయని వారిని దేశద్రోహులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుడ్డేపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.




