నెల్లూరు,మార్చి2(జనంసాక్షి): రానున్న వేసవిలో మండలంలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎంపీపీ వీరబోయిన రమాదేవి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, వేసవికి ముందే కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎదురవుతోందన్నారు. గ్రామాల వారీగా వివరాలతో కూడిన నివేదికలను అందజేస్తే వాటిని జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు. దీనివల్ల నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.




