అనంతపురం, జనంసాక్షి: మనీ లాండరింగ్‌కు మంత్రి శైలాజానాథ్ పాల్పడ్డారని కోబ్రాపోస్టు ప్రచురించిన కథనాలపై ఆయన స్పందించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతికి చెందిన డాక్టర్ హరిప్రసాద్ తనకు మంచి మిత్రుడని, ఆయన కోరితే సాయం చేశాను అని తెలిపారు. కేవలం రిఫరెన్స్ మాత్రమే ఇచ్చానని చెప్పారు. మనీలాండరింగ్ లాంటి పెద్ద పెద్ద పదాలు వాడొద్దని ఆయన మీడియాను కోరారు.




