చీపురుపల్లి, విజయనగరం, జనంసాక్షి: రాష్ట్రంలోని కాగ్ ఆడిట్ అడ్వయిజరీ బోర్డు సభ్యడిగా విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ పీడీకే రావును నియమిస్తూ అకౌంటెట్ జనరల్ వాణిశ్రీరాం ఉత్తర్వులు జారీచేశారు. శోధన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులుగా ఉన్న ఆయన ప్రస్తుతం రిజర్వు బ్యాంకు సలహా సభ్యడిగానూ పనిచేస్తున్నారు. ఈ నెల 15న హైదరాబాద్‌లోని కాగ్ కార్యాలయంలో జరిగే సమావేశానికి ఆయనకు పిలుపు వచ్చింది.




