Wednesday, 4 November 2026

అటవీభూముల ఆక్రమణదారులపై కేసులు

విశాఖపట్టణం,మార్చి3(జ‌నంసాక్షి): యలమంచిలి రేంజ్‌పరిధిలోని ఆరు మండలాల్లో ఉన్న అటవీభూముల ఆక్రమణలకు సంబంధించి 30మందిపై కేసులు ఉన్నట్లు రేంజ్‌ అధికారి సుదర్శన్‌రావు తెలిపారు. మొత్తం 13వేల ఎకరాల రిజర్వ్‌ ఫారె/-టస్‌ ఉండగా దానిలో 8వేల ఎకరాల్లో షెల్టర్‌బెల్ట్‌, 4 వేల ఎకరాల్లో వన సంరక్షణ సమితి ఉన్నట్లు తెలిపారు. దీంతోపాటు సిబ్బంది కొరత ఉందని ఆయన తెలిపారు. హుద్‌హుద్‌ తుపానులో నేలకూలిన టేకు, ఇతర చెట్ల కలప తరలింపునకు రైతులకు స్థానికంగా ఇచ్చే అనుమతులు గత నెలాఖరుతో ముగిసినట్లు ఆయన వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *