Wednesday, 4 November 2026

మొండూరులో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): దెందులూరు మండలం మొండూరు గ్రామంలో మహంకాళీ సుబ్రహ్మణెళ్యిశ్వర గుప్తా ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. పాలకొల్లుకు చెందిన రాజవల్లి రాధారమణ్‌, లయన్స్‌ కంటి ఆసుపత్రి రోగులకు పరీక్షలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సుమారు 300మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఇక బాదంపూడి మెమోరియల్‌ ట్టస్ర్‌ వ్యవస్థాపకుడు, లూబి మోటార్స్‌ యజమాని బాదంపూడి రమేశ్‌ జన్మదినం సందర్భంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ సమక్షంలో కేకు కట్‌ చేసి అందరికీ పంపిణీ చేశారు. మేదినరావు ఉన్నత పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఇదిలావుంటే మొండూరు తెదేపా అధ్యక్షుడిగా బి. శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహకార సంఘం అధ్యక్షుడు అన్నపనేని రవికుమార్‌, ఎంపీటీసీ సభ్యుడు బి. శ్రీనివాసల్మదరి, కమిటీ పరిశీలకులు గారపాటి ప్రసాదరావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఆలూరి ధర్మారావు, పొందూరు వెంకటేశ్వరరావులు, కార్యదర్శిగా ధర్మ సత్యనారాయణలను ఎన్నుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *