Wednesday, 4 November 2026

నెమలిలో వేణుగోపాలస్వామి బ్ర¬్మత్సవాలు

విజయవాడ,మార్చి3(జ‌నంసాక్షి): గంపలగూడెం కృష్ణాజిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్ర¬్మత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే స్వామి వారి మూలవిరాట్టుకు విశేషాభిషేకాలు నిర్వహించి ఉత్సవ విగ్రహాన్ని పెండ్లికుమారునిగా అలంకరించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధానార్చకులు టి. గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం స్వామి వారికి విశేష పూజలు చేశారు. 6 రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు నూజివీడు ఆర్డీవో సీహెచ్‌ రంగయ్య ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి హరి గోపీనాధబాబు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. పోలీస్‌ అవుట్‌పోస్టును, ఆరోగ్యశిబిరాన్ని ప్రారంభించారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. వేణుగోపాలస్వామి ఆలయ బ్ర¬్మత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్లపందేల పోటీలు ప్రారంభించారు. తొలిరోజు 58 అంగుళాల ఎత్తు ఉన్న ఎడ్లకు నిర్వహించిన పూటీ లాగుడు పోటీలో కృష్ణా, ఖమ్మం జిల్లాలకు చెందిన 10జతల ఎడ్లు పాల్గొన్నాయి. వరుస నాలుగు స్థానాల్లో విజేతలైన ఎడ్ల యజమానులకు నిర్వాహకులు నగదు బహుమతి అందజేయనున్నారు. ఎంపీపీ శ్రీనివాసరావు, జడ్పీటీసీ సభ్యుడు వెంకటకృష్ణారావు, ఆలయ ఈవో హరిగోపీనాధబాబు పాల్గొని పోటీలను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *