Wednesday, 4 November 2026

అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోశయ్య

విజయవాడ : తమిళనాడు గవర్నర్‌ రోశయ్య స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా పోరంకిలో ఆర్యవైశ్య సంఘం సమావేశాలకు ముఖ్య అతిథిగా రోశయ్య హాజరయ్యారు. వేదికపై రోశయ్య అస్వస్థతకు గురికావడంతో అధికారులు వెంటనే ఆయన్ని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోశయ్యకు అత్యవసర సేవల విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *