జనసేనపార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ గురువారం అనంతపురంలో బహిరంగసభ నిర్వహించనున్నారు. అనంతపురంలోని స్థానిక జూనియర్ కాలేజీ మైదానంలో సాయంత్రం 4 గంటలకు పవన్ సభ జరగనుంది. ఏపీకి ప్రత్యేక హోదా, అనంతపురంలో ఉన్న కరువుపై ప
వన్ కల్యాణ్ స్పందించనున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులంతా జనసేన కార్యకర్తలుగానే భావిస్తున్నట్టు జన సేన పార్టీ నేతలు అమర్నాథ్, వరుణ్ తదితరులు తెలిపారు. గురువారం జరగబోయే సభా వేదికకు తుళ్లూరు సుబ్బారావు, సభా ప్రాంగణానికి తరిమెల నాగిరెడ్డి పేరును పెట్టినట్టు నేతలు పేర్కొన్నారు. ఏర్పాట్లకు సహకరిస్తున్న ప్రభుత్వానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతపురంలో పవన్ సభ




