Wednesday, 4 November 2026

అనంతపురం: టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా నారాయణ

కళ్యాణదుర్గం టౌన్‌ : తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా దొడగట్ట నారాయణను, మండల కన్వీనర్‌గా డీకే రామాంజనేయులను ఎంపిక చేసినట్లు ఆపార్టీకార్యాలయం నుంచి పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కొన్ని నెలలక్రితం పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం అందులో కళ్యాణదుర్గం పట్టణం, రూరల్‌ మండల అధ్యక్షుల ఎంపికలో ఏకాభిప్రాయం రాకపోవడంతో కొంతకాలం పాటు వాయిదా పడింది. అయితే ఆదివారం ఎట్టకేలకు అధ్యక్షుల నియామకానికి సంబంధించిన ప్రకటనను పార్టీ ప్రముఖులు ఏకాభిప్రాయంతో నిర్ణయించి విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *