Tuesday, 3 November 2026

అనంతపురం: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హిందూపురం/చిలమత్తూరు : వసతి గృహంలో ఉన్న కొందరు విద్యార్థులు బెదిరించి డబ్బులు లాగేసుకుంటున్నారని దీనిని భరించలేని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన వైనం చిలమత్తూరులో చోటుచేసుకుంది. స్థాని క బీసీ బాలుర వసతి గృహంలో శనివారం ఉద యం రమేష్‌ అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. లేపాక్షి మండలం మామిడిమాకులపల్లికి చెందిన రమేష్‌ చిలమత్తూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతూ బీసీ వసతి గృహంలో ఉంటున్నాడు. స్వగృహానికి వచ్చిన విద్యార్థి శ నివారం ఉదయం హాస్టల్‌కు వెళ్లాడు. ఉద యం విషపుగులికలు మింగి భయం తో సాటి విద్యార్థులకు తెలుపగా వెంటనే వైద్యం కోసం హాస్టల్‌ సిబ్బంది హిందూపురం ప్రభుత్వ ఆ సుపతిక్రి తరలించారు. హాస్టల్‌లోని ఇద్దరు సీ నియర్‌ విద్యార్థులు తన వద్ద డబ్బులు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థి బయటకు వెళ్లి విషపుగుళికలు తీసుకువచ్చి ఆత్మ హత్యకు పాల్పడితే సిబ్బంది ఏమి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *