Tuesday, 3 November 2026

ఆటో, బైక్‌ ఢీ – వ్యక్తి మృతి

అనంతపురం ఓల్డ్‌టౌన్‌: నగర శివారులోని జేఎన్‌టీయూ రో డ్డులో ఆటో, ద్విచక్ర వాహనం ఢీ కొన్న ప్రమాదంలో రాప్తాడుకు చెం దిన రామాంజినేయులు కుమారుడు బోయ ముత్యాలన్న(29) మృతి చెందాడు. బేల్దారి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఆటో ఢీ కొంది. ప్రమాదంలో ముత్యాలన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్‌ ఎస్‌ఐ జాకీర్‌హుస్సేన్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నారు. మృతుడికి భార్య లక్ష్మి, రెండేళ్ళ కుమారుడు సందీప్‌ ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *