Tuesday, 3 November 2026

అప్పు చెల్లించలేదని గిరిజన యువకుడి నిర్బంధం

నెల్లూరు : అప్పు చెల్లించలేదని గిరిజన యువకుడిని నిర్బంధించిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం తాలుచింతలలో చోటుచేసుకుంది. చేసిన అప్పు చెల్లించకపోవడంతో యువకుడిని 4 రోజులుగా వ్యాపారి తన ఇంటిలో నిర్బంధించాడు. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన స్థానిక పోలీసులను ఆదేశించి యువకుడికి విముక్తి కలిగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *