Wednesday, 4 November 2026

అభయగోల్డ్‌ ఎండీని విచారిస్తున్న పోలీసులు

విజయవాడ : ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలుచేసి వారిక కుచ్చుటోపి వేసిన అభయగోల్డ్‌ ఎండీ శ్రీనివాసరావును విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో శ్రీనివాసరావు భార్య అంభిక, సంస్థ ఉద్యోగి మహేష్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు. పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వివిధ పోలీస్‌స్టేషన్లు తిప్పుతూ వారిని విచారిస్తున్నారు. గురువారం రాత్రి గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించి తెల్లవార్లు అదే స్టేషన్‌లో ఉంచారు. ఖాతాదారుల నుంచి ఎంత మేర సేకరించారు, దేనికి వినియోగించారు, సంస్థ తరపున ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి. అన్న అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అన్ని విషయాలు సేకరించిన తరువాతే వీరిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *