Wednesday, 4 November 2026

అమెరికాలో బతుకమ్మ వేడుకలు

 వాషింగ్టన్‌,అక్టోబర్‌ 22 (జనంసాక్షి): విదేశాల్లోనూ బతుకమ్మ పండగలు జోరుగా సాగుతున్నాయి. అమెరి కాలో తెలంగాణ వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బతుకమ్మ ఆడి పాడుతున్నారు. గ్రేటర్‌ ఇండి యానా పోలీస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇండియా కమ్యూనిటీ సెంటరులో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాల్లో ప్రవాసాంధ్ర మహిళలు, చిన్నారులు, బాలబాలికలు పెద్దసంఖ్యలో సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ ప్రవాసాంధ్రులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ బతుకమ్మ విశిష్ఠతను వివరించారు. వేడుకల్లో గీతా’ అధ్యక్షుడు చింతల రాము, కార్యవర్గ బృందం పాతర్ల శ్రవణ్‌ అమర్‌ లింగాల, గాదె షోరెడ్డి, శేఖర్‌ కృష్ణమనేని, అపర్ణ, రాజు చింతల తదితరులు పాల్గొన్నారు. ప్రతియేటా ఈ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *