విశాఖ: అవినీతి మంత్రులు తక్షణమే రాజీనామా చేసి తమ నిజాయితీని నిరూపించుకోవాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సైతం అవినీతి మంత్రులను తొలగించకపోవడం శోచనీయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పక్కా ప్రణాళికతో ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. జూలై 3న హైదరాబాద్‌లో లక్షమందితో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జరిగే బహిరంగసభలోనే నాగం జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరతారని చెప్పారు. ఈ ర్యాలీకి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి హాజరవుతారన్నారు.




