Thursday, 5 November 2026

ఆటోను ఢీకొన్న లారీ.. ముగ్గురి మృతి

కర్నూలు : కర్నూలు జిల్లా ఆదోనిలో ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆదోని నుంచి సూగురుకు ప్రయాణికులతో వస్తున్న ఆటోను కుప్పగల్లు వద్ద లారీ ఢికొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. మిగతావారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *