పశ్చిమగోదావరి: పెరవలి మండలం కడింపాడు వద్ద జాతీయ రహదాపై శనివారం ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆటోను అధిక వేగంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.




