విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రాన్ని చీఫ్ కంజర్వేటర్ ఫారెస్ట్ ఎస్.వి. కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జూపార్కుకి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూపార్కులో రూ.20 లక్షలతో నిర్మించిన ప్రధాన ద్వారం , రూ.15 లక్షలతో ఏర్పాటుచేసిన జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. జూపార్కుకు జిరాఫి, నామాల కోతులు రానున్నాయని తెలియజేశారు. సందర్శకులు పర్యటించేందుకు బ్యాటరీతో నడిచే ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటి వల్ల జంతువులకు ఎటువంటి శబ్ద కాలుష్యం ఉండదన్నారు. మరో కొద్ది రోజుల్లో సీతాకోక చిలుకల పార్కు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్నొన్నారు.




