తూర్పుగోదావరి: ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేశారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారనే అనుమానంతో గిరిజనులను చంపినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.




