అమరావతి : గుంటూరు జిల్లా అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న జ్ఞానబుద్ధ ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న అయకస్తంభం బుధవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు నేలకూలింది. కట్టడానికి అనుబంధంగా బౌద్ధమత చిహ్నాన్ని ప్రతిబింభించేలా చుట్టూ ఎనిమిది స్తంభాలను ఏర్పాటు చేశారు. వాటిలో పడమర వైపున్న రెండో స్తంభం నేలకూలింది. దీంతో ఈ కట్టడం నిర్మాణంపై స్థానికుల్లో అనుమానం వ్యక్తం అవుతోంది.




