Wednesday, 4 November 2026

ఉత్సాహంగా ప్రారంభమైన ‘డీ’జోన్‌ ఆటల పోటీలు

గుంటూరు,మార్చి3(జ‌నంసాక్షి):  జేఎన్టీయూ కాకినాడ పరిధిలోని ‘డీ’జోన్‌ ఆటల పోటీలు సత్తెనపల్లి మండలం కంటెపూడిలోని నలందా ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థుల కేరింతల నడుమ మంగళవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జేఎన్టీయూ కాకినాడ డైరెక్టర్‌ టి.ఉదయభాస్కర్‌ ప్రారంభించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 40 కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ప్రోగ్రాం డైరెక్టర్‌ డి.కోటేశ్వరరావు, టోర్నమెంట్‌ సెక్రటరీ శ్యామ్‌కుమార్‌, నలంద లద్ఘిర్మన్‌ వరప్రసాదరెడ్డి, కార్యదర్శి విజయశారదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *