గుంటూరు,మార్చి3(జనంసాక్షి): వివాహిత దారుణ హత్యకు గురయిన సంఘటన వినుకొండ పట్టణంలోని వెన్నపూస కాలనీలో సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. అడపాల లక్ష్మి (25) కాలనీలో నివాసముంటోంది. ఆమె భర్త గురవయ్య మంత్రాలయంలో తాపీ మేసౄగా పనిచేస్తుంటాడు. సోమవారం రాత్రి లక్ష్మి హత్యకు గురయింది. దీనిపై బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తన తండ్రి, పెదనాన్న, చిన్నాన్నలు రాత్రి గొడవపడ్డారని, తరువాత తాను నిద్రపోయానని ఆరేళ్ల లక్ష్మి కుమార్తె పోలీసుల విచారణలో తెలిపింది. సీఐ జి.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.




