శ్రీకాకుళం: ఒడిశాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నదికి నీటి ప్రవాహ తీవ్రత పెరిగింది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం తొలి హెచ్చరిక జారీ చేసింది. మరోపక్క నాగావళి నదిపై కొత్త వంతెన కూల్చివేత పనులు మధ్యలో ఉండగానే నదిలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతుండటంతో నీటి ప్రవాహ తీవ్రత పెరిగి నది గట్టు దాటుతోందని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు.




