అనంత గ్రామీణం, : ఎంసెట్ పరీక్షలు రాసున్న విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించారు. చిరంజీవిరెడ్డి కళాశాల, అనంతలక్షి, పీవీకేకే కళాశాలల్లో ఎంసెట్ రాసే విద్యార్థులకు వివిధ ప్రాంతాల ఆర్టీసీ బస్టాండు, గడియారస్తంభం నుంచి ఈ బస్సులు ఉదయం 8. 30 గంటలకే బయలుదేరుతాయన్నారు. అనంతలక్షి కళాశాల ధర్మవరం నుంచి కూడా ఒక బస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశం ఎంసెట్ రాసే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.




