చిత్తూరు : జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌లో ఎంసెట్ విద్యార్థుల పట్ల రైల్వే పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రాత్రి వేళ రైల్వేస్టేషన్‌లో విద్యార్థులు ఉండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత తెల్లవారుజామున వదిలేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి.




