Wednesday, 4 November 2026

ఎరువుల దుకాణం తనిఖీ

కడప,మార్చి3(జ‌నంసాక్షి): సుండుపల్లి రైల్వేకోడూరు ఏడీఏ సుబ్రహ్మణ్యం మంగళవారం సుండుపల్లిలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నిల్వలు, అమ్మకపు రిజస్టర్లను పరిశీలించారు. అమ్మకపు రిజస్టర్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, నిర్ణీత ధరలకే అమ్మాలని సూచించారు. లేకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. సుండుపల్లి,చిన్నమండ్యం మండలాల్లోనూ దుకాణాలను తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆయన వెంట ఏడీ కార్యాలయ ఏవో సుధాకర్‌, సుండుపల్లి ఏవో పవన్‌కుమార్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *