Wednesday, 4 November 2026

నీటిఎద్దడిపై ప్రత్యేక దృష్టి పెట్టండి: జడ్పీచైర్మన్‌

కడప,మార్చి3(జ‌నంసాక్షి):  అధికారులు, కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్పీ చైర్మన్‌ గూడూరి రవి తెలిపారు. మంగళవారం ఆయన కలసపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. కూలీలకు తప్పనిసరిగా ఉపాధి పనులు కల్పించాలన్నారు. మండలంలోని పలు సమస్యలను అధికారులు, సర్పంచులు జడ్పీ లద్ఘిర్మన్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎస్‌.సుదర్శన్‌, ఎంపీడీవో సృజన్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఇదిలావుంటే కలసపాడు, ఎగువరామపురాల్లోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు మురళీధర్‌రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఎంఆర్పీ ధరలకే విక్రయాలు జరపడంతో పాటు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని దుకాణాదారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్స్‌లు రద్దుచేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు చంద్రమోహన్‌రెడ్డి, ప్రవీణ్‌, ఏఈవో ఆదినారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *