కాకినాడ,మార్చి3(జనంసాక్షి): లోక్‌సభ మాజీ స్పీకర్, దివంగత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా పి.గన్నవరంలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్యెల్యే, భాజపా రాష్ట్ర కార్యదర్శి మానేపల్లి అయ్యాజీవేమ పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. బాలయోగి కళల ప్రాజెక్టు అయిన కోనసీమ రైల్వేలైన్ పూర్తి చేయడంతో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమను జాతీయ స్రవంతిలో కలిపేందుకు రైల్వే లైన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి డొక్కనాథ్‌బాబ్, బెల్లంపూడి సర్పంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల పక్షపాతి అని పి.గన్నవరం శాసనసభ్యుడు పులపర్తి నారాయణమూర్తి అన్నారు. తెదేపా మద్దతుతో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి చితన్యరాజు విజయానికి ఉపాధ్యాయులు అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను కలుసుకొని చైతన్యరాజుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి డొక్కా నాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.




