Tuesday, 3 November 2026

ఎర్రదొంగల ఆటకట్టించేందుకు టాస్క్‌ఫోర్స్‌

కడప,మార్చి2(జ‌నంసాక్షి): ఎర్రచందనం నరికివేతను అడ్డుకునేందుకు ఇకనుంచి టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తగిన ఆయుధాలతో అడవులను తనఖీలు చేస్తారని టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు తెలిపారు. కూలీలు ఇటువైపు రాకపోవడమే వారికి శ్రేయోదాయకమని డీఐజీ హెచ్చరించారు. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం దొంగల ఆటకట్టించడంలో చొరవచూపుతున్న పోలీసు సిబ్బందికి త్వరలోనే రివార్డులు ప్రకటించనున్నట్లు  తెలిపారు. సిఎం ఆదేవాలతో ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శేషాచలం అడవుల్లో ప్రత్యేకదళాలు ఇటీవల పలువురిని అరెస్టు చేసారు.  తమిళనాడులోని సేలం, ధర్మపురి, తిరువణ్ణామలై ప్రాంతాల నుంచి అమాయకులైన కూలీలను ఇక్కడకు తీసుకువచ్చి అడవులను నరికేందుకు వినయోగిస్తున్నారు.  కూలీలను తీసుకురావడంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు. కేవలం రూ.2000 నుంచి రూ.3000 కూలికి ఆశపడి తమిళనాడు నుంచి ఇక్కడికి రావడం, పోలీసులు తక్కువగా కనిపిస్తే దాడులు చేయడం, చివరకు ఎన్‌కౌంటర్లలో చనిపోవడం కూలీలకు పరిపాటిగా మారుతోందన్నారు.  ఎర్రకూలీలను పట్టుకోవడంలో చొరవచూపుతున్న  సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *