కడప,మార్చి2(జనంసాక్షి): జిల్లాలో 219 సింగిల్ విలేజ్ పథకాలు, 8 మల్టీ విలేజ్ పథకాలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. రాజంపేట డివిజన్‌లోని ఎంవీఎస్ పథకం పూర్తయిందని.. వేసవిలో ఆ ప్రాంతంలో నీటి సమస్య ఉండదన్నారు. జిల్లాలోని గ్రావిూణ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యశాఖకు ప్రపంచ బ్యాంకు రూ.94.94 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు ప్రపంచబ్యాంకు నిధులను రూ.56కోట్లు వినియోగించారు. మిగిలిన నిధులను ఖర్చు చేసి పథకాలను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ నిధులతో చేపట్టిన పనులు జిల్లాలో 70 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పనులు పక్కాగా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. లక్కిరెడ్డిప్లలె, బి.మఠం, కొండాపురం, వల్లూరు, చిలమకూరులో ఎంవీఎస్ పథకాలను జూన్ నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలోనే మొదటగా రాజంపేట డివిజన్‌లో ఎంవీఎస్ పథకాన్ని పూర్తి చేసి, ప్రజల దాహార్తి తీర్చినట్లు తెలిపారు. ఇదిలావుంటే సీమను సస్యశ్యామలం చేసేందుకు ఎన్టీఆర్ మూడు దశాబ్దాల క్రితమే గాలేరు- నగిరి సుజల స్రవంతి పథకానికి శంకుస్థాపన చేశారన్నారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు అడ్డుకోకుండా ఉంటే ఎప్పుడో నీళ్లు వచ్చేవన్నారు. కృష్ణా నిరకజలాలు కావాలని ఆనాడు రాద్దాంతం చేయడంవల్ల ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు. ఇవన్నీ పూర్తయివుంటే ఇవాళ మంచినీటి సమస్య వచ్చేది కాదన్నారు. రాయలసీమలో కరవును పారదోలేందుకు నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీరామారావు గండికోట జలాశయాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గండికోట, పైడిపాళెం పనుల్లో జరిగిన వందకోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.




