Tuesday, 3 November 2026

ఎర్ర చందనం పట్టుకున్న అటవీ శాఖ అధికారులు

రాపూరు గ్రామీణం : నెల్లూరు జిల్లా రాపూరు అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని గోనుపల్లి బీబ్‌ వద్ద రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 15 లక్షల విలువ చేసే 54 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గత రెండు రోజులుగా మూడు బృందాలుగా గాలింపు చేపట్టి వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న దుంగలను వెంకటగిరి అటవీశాఖ గోదాంకు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *