Tuesday, 3 November 2026

ఎస్‌వీయూ పీజీ ప్రవేశ పరీక్షల్లో మాస్‌కాపింగ్‌

తిరుపతి,(జనంసాక్షి): శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌ కాపింగ్‌ పాల్పడిన చిత్తూరు జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ జిల్లా విద్యార్థి నాయకుడు రవినాయడును వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి నాయకులు యూనివర్శిటీ అధికారులకు పట్టించారు. పీజీ ప్రవేశ పరీక్షలో మాస్‌కాపింగ్‌ పాల్పడుతుండా రవినాయుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ మాస్‌ కాపింగ్‌ వ్యవహారం వెనుక అదే సామాజిక వర్గంకు చెందిన ఓ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ హస్తం ఉందని వైఎస్‌ఆర్‌ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. కాపింగ్‌ పాల్పడిన జవాబు పత్రాలను ఎస్‌వీయూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాపింగ్‌ వ్యవహారంపై విచారించా తగిన చర్య తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *