Tuesday, 3 November 2026

ఏడాది బాలుడికి వాతలు

కర్నూలు, జిల్లాలోని గోనెగండ్ల మండలం లింగందిన్నెలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఏడాది బాలుడికి తండ్రి వాతలు పెట్టాడు. గ్రామానికి చెందిన పెద్దకాశిం, వీరేశ్వరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాది బాలుడు ఉన్నాడు. అయితే కొడుకు తనకు పుట్టలేదంటూ భార్యపై అనుమానంతో పెద్దకాశిం అత్యంత పాశవికంగా చిన్నారి చేతులు కాల్చాడు. అక్కడకు చేరుకున్న భార్య ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసింది.
వెంటనే బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. తనపై అనుమానంతోనే భర్త ఈ ఘోరానికి పాల్పడ్డాడని వీరేశ్వరి తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *