Wednesday, 4 November 2026

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాజీ మంత్రి దీక్ష

కృష్ణా:ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కృష్ణా జిల్లా నందిగామలో గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినానాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పక్షాల నాయకులు, కార్యకర్తలు, నందిగామ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కన్నెగంటి జీవరత్నంలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *