ఏలూరు, జనంసాక్షి: ఆంధ్రప్రదేశ్ మహిళలను కేంద్ర మంత్రి జైరాం రమేష్ పొగడ్తలతో ముంచెత్తారు.ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఆయన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి జిల్లాలో పర్యటించారు. ఆటో నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. బెల్టుషాపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు.




