ఏలూరులో న్యాయవాది దారుణ హత్య

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో సోమవారం మధ్యాహ్నం ఓ న్యాయవాది దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయల్‌ అనే న్యాయవాది వన్‌టౌన్‌లో ఓ దుకాణంలో ఉండగా నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాయల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజావార్తలు