ఏలూరు : చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన 50 మంది పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం యాత్రికులు సురక్షితంగా ఏలూరు చేరుకున్నారు. ప్రత్యేక రైలులో ఏలూరు చేరుకున్న వీరికి బంధువులు స్వాగతం పలికారు. వరద ముప్పు నుంచి యాత్రికులు సురక్షితంగా చేరుకోవడంతో బంధువులు అనందం వ్యక్తం చేస్తున్నారు.




