Wednesday, 4 November 2026

ఏసీబీ వలలో గుంతకల్‌ డీసీటీవో

అనంతపురం : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ గుంతకల్‌ డీసీటీవో (డిప్యూటీ కమిర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌) ఏసీబీ అధికారులకు చిక్కారు.గుంతకల్‌ డీసీటీవో అధికారిగా పనిచేస్తున్న రమేష్‌కుమార్‌రెడ్డి ఓ లారీ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేయగా ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని రమేష్‌కుమార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *