పనబాక
గుంటూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఢిల్లీ నుంచిఅధిష్ఠానం పిలుపుపై కేంద్ర మంత్రి పనబాక లక్షి అచితూచి స్పందించారు. ఇందిరమ్మ కలల పథకంపై మంత్రివర్గ సహచరుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన తరుణంలోనే హస్తినకు రావాల్సిందిగా వర్తమానం అందినట్లు వచ్చిన కథనాలను అమె తోసిపుచ్చారు. తమది జాతీయ పార్టీ అని, ఏ విషయాలపైనైనా చర్చించేందుకు ఢిల్లీ పిలవడం సహజమేనన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ భేషుగ్గా ఉందని, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికతో పాటు ఎస్సీ గృహాలకు విద్యుత్తు రాయితీ వంటి మంచి పథకాల అమలుతో ప్రభుత్వం ప్రజాదరణ పొందుతోందని ఆమె వ్యాఖ్యానించారు.




